telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్నందుకు ..రూ.4,200 జరిమానా

After 11 Parishat Elections Telangana

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్నందుకు కేసులో ఇరుక్కున్నాడు. అంతే కాకుండా జరిమానా చల్లించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన చిర్ర మోహన్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోతే గ్రామంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకొన్నాడు.

ఓటు వేస్తూ మొబైల్‌తో సెల్ఫీ ఫొటో తీసుకున్నాడు. విషయాన్ని గమనించిన పోలింగ్ ఆఫీసర్ భీంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాగా, విచారణలో మోహన్ సెల్ఫీ తీసుకున్నట్లు ఒప్పుకోవడంతో కరీంనగర్ కోర్టు న్యాయమూర్తి మోహన్‌కు రూ.4,200 జరిమానా విధించినట్లు జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు.

Related posts