telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

రిలయెన్స్ జియో .. నెలవారీ ప్లాన్ లు.. ఇలా ..

jio fiber monthly plan details

నేటి నుంచి రిలయెన్స్ జియో ఫైబర్ సర్వీసులు కమర్షియల్‌గా ప్రారంభమయ్యాయి. ఇతర కంపెనీలకు ధీటుగా ప్లాన్స్ ప్రవేశపెట్టింది రిలయెన్స్. వేయి 600 నగరాల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ – జియో ఫైబర్ దాని ఫైబర్ టు ది హోమ్ సర్వీసును ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. ఇందుకు ప్లాన్స్ కూడా వెల్లడించింది. ఈ ప్లాన్లు నెలకు రూ. 699 నుంచి రూ. 8 వేల 499 మధ్య ఉండనున్నాయి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం పేరిట మొత్తం 6 ప్లాన్లను పరిచయం చేసింది. జియో ఫైబర్ ప్లాన్లు నెలకు రూ. 699 నుంచి ప్రారంభం.

నెలవారి ప్లాన్లు ఈ విధంగా ఉన్నాయి :
ప్లాన్ అద్దెలు : రూ. 699 – రూ. 8, 499, 100 MBPS వేగం.
దీర్ఘకాలిక ప్లాన్స్ : 3, 6, 12 నెలల ప్లాన్స్ ఎంచుకోవచ్చు. EMI సౌకర్యం కూడా కల్పించారు. ఇందుకు బ్యాంకులతో టై అప్ ఉండాలి.
వార్షిక ప్లాన్ : జియో హోమ్ గేట్ వే, జియో 4కె సెట్ టాప్ బాక్స్, టెలివిజన్ సెట్ (గోల్డ్ ప్లాన్ ఆ పైన మాత్రమే), ఓటీటీ అనువర్తనాలకు చందా, అపరిమిత వాయిస్, డేటా సేవలు.

Titanium Plan : ధర నెలకు రూ. 8, 499. 1 GBPS వేగంతో డేటా. నెలకు 5000 GB, దాటితే..1 MGPS వేగంతో నెట్ పని చస్తుంది. వార్షిక చందా తీసుకుంటే..(రూ. 1, 01, 988) సెట్ టాప్ బాక్స్, హోమ్ గేట్ వేతో పాటు 43 ఇంచుల 4k టీవీ ఫ్రీ.

Gold Plan : ధర నెలకు రూ. 1, 299. 250 MBPS వేగంతో డేటా. నెలకు 500 GB + 250 GB ఎక్స్ ట్రా. 750 GB దాటితే..1 MBPS వేగంతో నెట్ పని చస్తుంది. రెండేళ్ల వార్షిక చందా తీసుకుంటే..(రూ. 31,176) సెట్ టాప్ బాక్స్, హోమ్ గేట్ వేతో పాటు 24 ఇంచుల HD టీవీ ఫ్రీ.

Silver Plan : ధర నెలకు రూ. 849. 100 MBPS వేగంతో డేటా. నెలకు 200 GB + 200 GB ఎక్స్ ట్రా. 400 GB దాటితే..1 MBPS వేగంతో నెట్ పని చస్తుంది. వార్షిక చందా తీసుకుంటే..(రూ. 10 వేల 188) సెట్ టాప్ బాక్స్, హోమ్ గేట్ వేతో పాటు THUMP – 2 -12W బ్లూ టూత్ స్పీకర్ ఫ్రీ.

Bronze Plan : రూ. 699. 100 MBPS వేగంతో డేటా. నెలకు 100GB-50 GB ఎక్స్ ట్రా. 150 GB దాటితే..1 MBPS వేగంతో నెట్ పని చస్తుంది. వార్షిక చందా తీసుకుంటే..(రూ. 8 వేల 388) సెట్ టాప్ బాక్స్, హోమ్ గేట్ వేతో పాటు MUSE – 2 -6W బ్లూ టూత్ స్పీకర్ ఫ్రీ.

Diamond Plan : ధర నెలకు రూ. 2, 499. 500 MBPS వేగంతో డేటా. నెలకు 1250 GB + 250 GB ఎక్స్ ట్రా. 1500 GB దాటితే..1 MBPS వేగంతో నెట్ పని చస్తుంది. వార్షిక చందా తీసుకుంటే..(రూ. 29 వేల 988) సెట్ టాప్ బాక్స్, హోమ్ గేట్ వేతో పాటు 24 ఇంచుల HD టీవీ ఫ్రీ.

Platinum Plan : ధర నెలకు రూ. 3, 999. 1 MBPS వేగంతో డేటా. నెలకు 2500 GB. 2500 GB దాటితే..1 GBPS వేగంతో నెట్ పని చస్తుంది. వార్షిక చందా తీసుకుంటే..(రూ. 47 వేల 988) సెట్ టాప్ బాక్స్, హోమ్ గేట్ వేతో పాటు 32 ఇంచుల HD టీవీ ఫ్రీ.

ఏ ప్లాన్ తీసుకున్నా..అదనంగా వన్ టైమ్ పేమెంట్ రూ. 2,500 చెల్లించాలి. ఇందులో రూ. 1000 ఇన్ స్టాలేషన్ ఛార్జీలు, మిగిలిన డబ్బు (రూ. 1500) సెక్యూర్టీ డిపాజిట్.

Related posts