telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఆన్లైన్ యాప్స్ కేసు : కీలకంగా మారిన చైనాకు చెందిన ఇద్దరు మహిళలు

ఆన్లైన్ యాప్స్ కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది సైబర్ క్రైమ్. ఇన్ స్టెంట్ లోన్ అప్స్ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు.. చైనాకు చెందిన జెన్నిఫర్, ఏంజలీనా ఇద్దరు మహిళలు కీలకంగా ఉన్నటు గుర్తించారు. ఇండోనేషియా లో ఉంటూ గుర్గావ్ కేంద్రంగా ఆన్లైన్ ఆప్స్ నిర్వహిస్తున్నారని… ఇద్దరు మహిళలు విదేశాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. లాంబో గుర్గావ్ లో ఉండి యాప్స్ నిర్వహణ చూస్తున్నాడని పోలీసులు గుర్తించారు. 27 వేల కోట్ల స్కాం కేసులో ప్రధాన నిందితులైన లాంబా, నాగరాజు లను పూర్తి స్థాయి విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ కేసును విచారించిన కోర్టు చైనాకు చెందిన లాంబో, నాగరాజును నాలుగు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. దీంతో ఈ రోజు లాంబో, నాగరాజుకు కస్టడీకి తీసుకోనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ క్రైమ్ కార్యాలయంలో నాలుగు రోజులపాటు వీరిద్దరిని విచారించనున్నారు పోలీసులు.

Related posts