ఓ మాజీ నర్సు సౌదీ నుంచి ఆస్ట్రేలియా పయనమైంది. తన వెనుక సీట్లో పసివాడి ఏడుపు వినిపించి.. ఆ జంట వద్ద నుంచి పిల్లాడిని తీసుకొని ఆడించింది. కాసేపటికి పిల్లాడు ఏడుపు ఆపడంతో వాడిని తల్లిదండ్రులకు అప్పగించింది. ఆ తర్వాత తన పనిలో తను మునిగిపోయింది. ఓ ఎయిర్‌హోస్టెస్ బలంగా తన భుజాన్ని కదపడంతో ఈ లోకంలోకి వచ్చి.. ఏం జరిగిందంటూ ఆ ఎయిర్‌హోస్టెస్‌ను ప్రశ్నించింది. వెనక సీట్లోని జంట చేతుల్లో పసివాడి మొహం రంగు మారడం చూపించిన ఆ ఎయిర్‌హోస్టెస్.. పసివాణ్ణి ఆ నర్సు చేతిలో పెట్టింది. ఆ పిల్లవాడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని గుర్తించిన ఆ నర్సు.. విమానంలో ఎవరైనా డాక్టరున్నారా అంటూ కేకలేసింది. అలా అరుస్తూండగానే.. ఆమె కళ్లముందే ఆ పసివాడు ఊపిరి వదిలాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. సౌదీ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న ఎయిర్ ఏసియా విమానంలో జరిగిన ఈ ఘటన తన హృదయాన్ని కుదిపేసిందని చెప్పింది.
previous post
జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలి: జేసీ దివాకర్‌రెడ్డి