telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

స్టీల్ ప్లాంట్‌ కోసం పార్టీలు పక్కన పెడదాం : గంట

Ganta srinivas tdp

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు.. ఇక, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంద శాతం అయిపోయింది.. అది ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఇప్పుటికైనా ముఖ్యమంత్రి ప్రధాన పాత్ర తీసుకోవాలని… అధికారంలో ఉన్నవారికి ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు.  స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ పై చంద్రబాబు కూడా ప్రధానికి లేఖ రాశారన్నారు గంటా శ్రీనివాసరావు.. ప్లాంట్‌ కాపాడుకోవడం కోసం రాజకీయాలు, పార్టీలు పక్కన పెడదామని సూచించిన ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై స్పందించాలని.. ప్లాంట్ పరిరక్షణ కోసం పవన్ కల్యాణ్ ముందుకు రావాలని కోరారు. ఇక, బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా నా రాజీనామాను అమోదింపచేసుకుంటాను అన్నారు గంటా.. వైసీపీ నేతలు రాజీనామాలు చివరి అస్త్రం అన్నారు.. ఇప్పుడైనా వైసీపీ నేతలు చివరి అస్త్రం వాడాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ఒక ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్లాలన్న గంటా… అధికార పార్టీతో తోడుగా పోరాటం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts