telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో 90 శాతం ఓటింగ్‌ జరగాలి: నరసింహన్‌

Republic Day Celebrations Hyderabad

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 90 శాతం ఓటింగ్‌ జరగాలని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్స్‌ డే సెలబ్రేషన్స్‌లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు అందరి హక్కు అని అన్నారు 18 ఏళ్లు నిండినవారు ఓటు నమోదు చేసుకుని ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు అభినందనీయమన్నారు. ప్రభుత్వాన్ని నిందించకుండా అందరూ ఓటు వేయండని ప్రజలకు గవర్నర్‌ నరసింహన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి, సీఈఓ రజత్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌, సీపీ అంజన్‌ కుమార్‌, విద్యార్తీనీ, విద్యార్ధులు పాల్గొన్నారు.

Related posts