telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అదరగొట్టిన “ఆచార్య” టీజర్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే… తాజాగా ఆచార్య టీజర్‌ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ఈ టీజర్‌ లో మెగాస్టార్‌ చిరంజీవి దుమ్ము లేపాడు. నేను టీచర్‌ కాదు.. అయినా నన్ను ఆచార్య అని పిలుస్తారు. ఎందుకంటే నేను గుణపాఠాలు చెబుతాననేమో అంటూ చిరంజీవి పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెప్పాడు. ఇక ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర బృందం టీజర్‌లోనే పేర్కొంది.

Related posts