telugu navyamedia
సినిమా వార్తలు

మాస్‌ మహారాజ్‌ ‘ఖిలాడి’ ఎప్పుడంటే..

మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఖిలాడి’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ యేడాది మే 28వ తేదీన విడుదల కావాల్సింది. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. 2022 ఫిబ్రవరి 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

Image

ఈ పోస్టర్‌లో రవితేజ సిగరెట్‌ తాగుతూ ఘాటైన మాస్‌ గెటప్‌లో దర్శనిమిచ్చాడు. దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

Related posts