telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రికార్డ్ క్రియేట్ చేసిన రామరాజు టీజర్…

ramcharan

ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే . జూనియర్ ఎన్టీఅర్, రామ్ చరణ్ హీరోలుగా పీరియాడికల్ ఫిక్షన్ సినిమా ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) తెరకెక్కుతుంది. మన్యం వీరుడు అల్లూరిగా చరణ్ , గిరిజన వీరుడు కొమరం భీమ్ గా తారక్ నటిస్తున్న విషయం తెలిసిందే . ఇటు రాంచరణ్ అభిమానులు.. అటు ఎన్టీఅర్ అభిమానులు అప్డేట్స్ కోసం నిత్యం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేసిన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకుంది. మొత్తం 5 భాషలలో రిలీజ్ అయిన ఈ టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటివరకు ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీంతో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్‌లో షూటింగ్ జరుపుతున్నారు. దాదాపుగా ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ యాక్ట్ చేస్తోంది.

Related posts