telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మిస్టర్ కూల్ పై కూడా వివాదాలా.. ఎఫ్‌ఐఆర్ నమోదు ..

fir filed on dhoni by amrapali real estate customers

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చాలా కూల్‌గా ఉంటాడు. అతడి ఆగ్రహావేశాలు పెల్లుబికిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ధోని ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ స్కామ్‌లో పోలీసులు ధోనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఒకప్పుడు ఈ సంస్థకు ధోని ప్రచార కర్తగా వ్యవహరించాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని ఉండటంతో చాలామంది ఫ్లాట్ల కోసం డబ్బులు అడ్వాన్స్ రూపంలో ముట్టజెప్పారు. అలా వచ్చిన కోట్ల సొమ్మును ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అనేక కంపెనీలకు తరలించడం జరిగింది. ఆ కంపెనీల లిస్ట్‌లో ధోని భార్య సంస్థ కూడా ఉండటం గమనార్హం.

అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు తీసుకుని లబ్దిదారులకు ఫ్లాట్లను అప్పజెప్పక పోవడంతో.. వారందరూ పోలీసులను ఆశ్రయించారు. 2017లో ఈ కేసు సుప్రీమ్‌కు చేరగా.. ఆ సంస్థ మోసాలకు పాల్పడిందని రుజువైంది. దీంతో ఆమ్రపాలి డైరెక్టర్లు జైలుపాలయ్యారు. ఈ స్కామ్ ఇటు తిరిగి.. అటు తిరిగి ధోని మెడకు చుట్టుకుంది. ధోనీపై నమ్మకంతోనే ఫ్లాట్ల కొనుగోలుకు డబ్బును కట్టామని.. ఈ కుట్రలో అతడికి కూడా భాగం ఉండొచ్చని వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ధోనీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. సుప్రీమ్ కోర్టు ఆమ్రపాలి సంస్థపై తుది తీర్పు ఇచ్చిన తర్వాత ధోని విషయంలో పోలీసులు ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts