telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పాక్ లో.. 22 ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు.. 9 జైషే సంస్థ కు చెందినవే..! వాళ్లకు స్వర్గ ధామంగా .. !!

Surgical Strike 2Pakistan Indian air space

పత్తిత్తు .. అనేమాట వినే ఉంటారు. పాక్ కూడా తన దేశంలో అందరు శాంతి దూతలని పైకి చెప్పుకుంటూ, లోన అంతా కుళ్లుతోంది. తాజాగా ఒక సర్వే ప్రకారం పాక్ లో 22 ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు ఇప్పటికీ పనిచేస్తున్నాయని, వాటిలో తొమ్మిది జైషే మహమ్మద్‌ సంస్థకు చెందినవేనని తేలింది. వీటిపై పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, వాటికి ఆ దేశం స్వర్గ ధామంగా తయారైందని పేర్కొంది. సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలు తీవ్రమైతే .. బాలాకోట్ వైమానిక దాడులలాంటివి భారత్‌ మరిన్ని చేపడుతుందని ఇప్పటికే రక్షణ రంగ అధికారులు హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే.

‘పాక్ ఉగ్రవాదులకు కేంద్రంగా ఉంది. ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆ దేశం సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడి నాయకత్వం తిరస్కరణ ధోరణిలో ఉంది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధవాతావరణం సృష్టించడానికి పాక్‌ ప్రయత్నిస్తోంది. ఉగ్రసంస్థలకు వ్యతిరేకంగా పాక్‌ ఎలాంటి చర్యలు చేపట్టకపోగా.. ఉద్రిక్తతలు పెంచే వాతావారణాన్ని సృష్టిస్తోంది. కరాచీలో పౌర విమాన సేవలు నిలిపివేసి ఎమర్జెన్సీ తరహా వాతావరణాన్ని సృష్టించేందుకు యత్నించింది’ అని ఆ అధికారి తెలిపారు.

పాక్‌ పలు ఉగ్రవాద సంస్థల నేతలను గృహనిర్బంధం చేయడంలాంటి చర్యలపై కూడా ఆ అధికారి స్పందిస్తూ.. ‘ఇవి కొత్తేమీ కాదు.. భారత్‌లో ఉగ్రదాడుల అనంతరం పాక్‌ ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుంది’ అని తెలిపారు. గృహ నిర్బంధం పేరిట ఉగ్రవాదులకు ఆ దేశం విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తోందని చెప్పారు. మామూలు పరిస్థితులు నెలకొనగానే.. వారిని పాక్‌ విడిచిపెడుతుందని వెల్లడించారు.

Related posts