బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్స్‌తో నటించిన సల్మాన్ చాలామందితో ప్రేమాయణం నడిపారు. ఆ మధ్య లులియా వాంటర్‌తో సల్మాన్ పెళ్లి జరగనుందని ప్రచారం చేశారు. కానీ అది ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే తాజాగా సల్మాన్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు అంటోంది ఓ బాలీవుడ్ భామ. “వీర్” చిత్రంలో సల్మాన్ సరసన నటించిన జరీనా ఖాన్ తాజాగా మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన పర్సనల్ విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అయితే రిపోర్టర్ మీ పై మీరు ఓ రూమర్ సృష్టించుకోవాలి. అది ఫుల్ వైరల్ కావాలి ? అని జరీనాను అడగ్గా… ఆమె వెంటనే “సల్మాన్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. నాపై ఇలాంటి రూమర్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. నాకు అసలు పెళ్లిపై నమ్మకం లేదు. చెప్పాలంటే ఈ మధ్యకాలంలో పెళ్లనేది కామెడీగా మారిపోయింది” అంటూ చెప్పుకొచ్చింది.
బ్రేక్ లేకుండా 30 గంటలు చేయగలను : రకుల్ ప్రీత్ సింగ్