telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ ?

Kajal-Agarwal

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడుచేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేసుకోని ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాదులో రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ వుండాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశాడట. ఈ ప్రత్యేక గీతం కోసం కాజల్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. గతంలో ఎన్టీఆర్ తో కలిసి “జనతా గ్యారేజ్”లో “పక్కా లోకల్” అంటూ కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు కాజల్ అంతకుమించిన రేంజ్ లో బన్నీతో కలిసి దుమ్ము రేపేస్తుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ పాటను చిత్రీకరిస్తారని అంటున్నారు.

Related posts