telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

వకీల్ సాబ్ కు మరో షాక్…!

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కథానాయకుడు నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం శుక్రవారం విడుదల కానున్న తరుణంలో ఆ చిత్రాన్ని ఆపేందుకు కుట్ర చేశారు. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికను సాకుగా చూపించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన మెరువ సురేంద్ర అనే వ్యక్తి ద్వారా ఈ ఫిర్యాదు వెళ్ళేలా చేశారు. వకీల్ సాబ్ చిత్ర కథానాయకుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు జనసేన అధ్యక్షులు కాబట్టి ఆయన చిత్రం తిరుపతి ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుంది కాబట్టి విడుదల నిలిపివేయాలని సురేంద్ర కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు పంపారు. గురువారం దీన్ని పరిశీలించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.విజయానంద్ ఈ ఫిర్యాదుపై విచారించి సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిగా ఉన్న నెల్లూరు కలెక్టర్ ను ఆదేశించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ నివేదికను చీఫ్ ఎలక్టోరల్ అధికారికి పంపారు. జనసేన పార్టీ బీజేపీ పొత్తులో ఉన్నదని, తిరుపతిలో శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రచారం చేశారని ఆ నివేదికలో పేర్కొన్నారు. దూరదర్శన్ అనేది ప్రభుత్వ పరిధిలోని చానెల్ కాబట్టి అందులో ప్రసారం కారాదు అనేది ఎన్నికల నియమావళిలో ఉన్నదని ఆ నిబంధన ఇందుకు వర్తించదని పేర్కొన్నట్లు సమాచారం. ఆ మేరకు వకీల్ సాబ్ చిత్రం విడుదలకు ఫిర్యాదు దారుడు పేర్కొన్న అభ్యంతరాలను తోసిపుచ్చారు.

Related posts