హైద్రాబాద్ నగరంలో ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై కేపీహెచ్‌బీ, ఎస్‌వోటీ మాదాపూర్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నిర్వాహకులతోపాటు విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లి, ప్రగతీనగర్‌లకు చెందిన ఆరిపాక కృష్ణ, మరో యువతి కేపీహెచ్‌బీ రోడ్ నెం. 1లో ఎంఐజీ 59లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని యూనివర్సల్ హెయిర్ అండ్ స్పాను నిర్వహిస్తున్నారు.
సులేఖ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా కస్టమర్లను బుక్ చేస్తూ వ్యభిచారం నడిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిల ఫొటోలను పంపిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తూ పెద్దమొత్తంలో కస్టమర్ల వద్ద డబ్బులను వసూలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు కేపీహెచ్‌బీ పోలీసులతో కలిసి దాడి చేశారు. అదే సమయంలో కేంద్రం నిర్వాహకులు కృష్ణ, యువతితోపాటు విటులు గుణశేఖర్, తారకనాథ్ సింహాద్రిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదు: దివ్యవాణి