ఆక్సిజన్ కేటాయింపు పై మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. అందులో ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య అదనంగా 30వేలకు పెంచనున్నామని.. దీని కోసం ప్రతి రోజు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని కోరారు. స్టోరేజ్ సదుపాయం లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉపయోగించగలుగున్నామని.. తమిళనాడు నుంచి కేటాయించిన ఆక్సిజన్ రావడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని లేఖలో వెల్లడించారు. అలాగే.. తిరుపతి రుయా హాస్పిటల్ ఘటనను ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లిన సీఎం జగన్.. చెన్నై, కర్ణాటక నుంచి రావలసిన ఆక్సిజన్ కొద్ది గంటలు ఆలస్యం కావడంతో 11 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. రాయలసీమ ఆక్సిజన్ అవసరాల కోసం జామ్ నగర్ నుంచి నిత్యం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ను కొనసాగించాలని లేఖలో విఙప్తి చేశారు సీఎం జగన్.
previous post
next post