telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రియబాంధవుడా….!!

ఈ చీకటి ఇంకా విడిపోదేమి..
ఈ రాతిరి ఎంతకీ కరగదేమి..!
కలల తెప్పలపై విహరించి అలసిపోయాను..
తారలకబుర్లు విని విసిగిపోయాను…!
వెలుగుపూలు తెచ్చే నీకోసం
ఎదురుచూస్తూ..
నిబిడాంధకారంలోని.. నిశీథిలోగిలిలో..
గుమ్మానికి తోరణమై వేలాడుతున్నాను..!
క్షణాలు తరలిపోతున్నాయి..
యుగాలు దాటిపోతున్నాయి..
నువ్వొస్తావనే ఆశతో..
నీమీద ధ్యాసతో..
తోటలోని పూలన్నికోసి.. దోసిట నింపుతున్నాను..
తూరుపుదిక్కుకు తిరిగి..
దారంతా చూపులతివాచీలు పరిచాను..!
నీకోసం కొండలెక్కలేను.. కోనలన్నీ తిరగలేను
దిక్కులు దాటలేను.. దివ్వెనై వెలగలేను…!
వెచ్చని కిరణాలతో..
వళ్ళంతాతడిమేసే అల్లరిపిల్లవాడా..
నీజాడ ఏదయ్యా సూర్యుడా..
ఆరడిపెట్టకు.. ఆలస్యం చేయకు..
నన్నలరింపగ.. వేగిరమే..
రావయ్యా నా.. ప్రియబాంధవుడా….!!

Related posts