telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ హీరో… ఇప్పుడు ఐసీయులో…!

Tovino

మలయాళ నటుడు టోవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాలా’. ఈ సినిమా సెట్స్‌లో టోవినో తీవ్రంగా గాయపడడంతో… ఆయనను కొచ్చి, ఎర్నాకుళంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో ఉన్నారు. “కాలా” సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు టోవినో కడుపుకు తీవ్రంగా గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు తెలుస్తోంది. అయితే టివినో పరిస్థితి విషమంగా లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యంపై వదంతులను నమ్మద్దని, తామే అధికారిక ప్రకటనను ఇస్తామని థామస్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.

Related posts