బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. అధికారపీఠం ఎక్కిన తర్వాత హామీల అమలు విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం పక్కనబెడితే… ఎడాపెడా హామీలు మాత్రం ఇస్తూనే ఉంటారు మన నేతలు. ఇప్పటికే తాము గెలుస్తే కరోనా వ్యాక్సిన్ ఫ్రీ అంటూ ఓ హామీ ఇవ్వడంతో.. బీజేపీపై దేశవ్యాప్తంగా విమర్శలు పెరగగా.. ఇప్పుడు.. తానే ముఖ్యమంత్రిగా ఎన్నికైతే తొలి క్యాబినెట్ సమావేశంలోనే బీహార్ యువతకు ఉద్యోగాలు కల్పించేలా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఫైల్‌పై తొలి సంతకం చేస్తానని ప్రకటించారు ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్.. ఇక, బీహార్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, ప్రచారంపై స్పందించిన తేజస్వి యాదవ్… ఆయన పర్యటనను స్వాగతిస్తున్నాం.. కానీ, ఆయన బీహార్ స్వయం ప్రతిపత్తితోపాటు కర్మాగారాలు ఏర్పాటు చేయకపోవడం, నిరుద్యోగ సమస్యలతోపాటు ఇతర రాష్ట్ర సమస్యలపై తప్పక సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.. కాగా, బీహార్ ఎన్నికల్లో బీజేపీ సహకారంతో నితీష్‌కుమార్ సీఎం పగ్గాలు చేపడతారని సర్వేలు చెబుతున్నాయి.