హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా “జిగర్తాండ”కు ఈ సినిమా రీమేక్. ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్ ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మరో డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు. ప్రముఖ తమిళ్ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక యంగ్ హీరో నితిన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కన్పించనున్నారట. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం దేవత. ఇందులో శ్రీదేవి, శోభన్ బాబు మధ్య వచ్చే వెల్లువచ్చె గోదారమ్మ అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో బిందెల మధ్య వీరిద్దరు నృత్యం చేయడం అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఇదే సాంగ్‌ని సేమ్‌లో స్టైల్‌లో రీమేక్ చేస్తున్నారు వాల్మీకి చిత్రబృందం. వరుణ్ తేజ్, పూజా హెగ్డేల మధ్య వెల్లువచ్చె గోదారమ్మ రీమేక్ సాంగ్ చిత్రీకరించగా, అందుకు సంబంధించిన వీడియో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉంది. వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుండగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు.
previous post