telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఉగ్రవాదం నుండి సిరియాకు విముక్తి .. చివరి ఐఎస్ ఉగ్రస్థావరం కూడా ధ్వంసం .. : సిరియా డెమోక్రటిక్ ఫోర్సెస్

last IS camp also collapsed by sdf

సిరియా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం నుంచి విముక్తి పొందింది. సిరియాలో ఉన్న చివరి స్థావరాన్ని కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూపు కోల్పోయింది. దీనితో కాలిఫా యుద్ధం ముగిసినట్లు అమెరికా మద్దతు ఉన్న సిరియా డెమోక్రటిక్ ఫోర్సెస్ వెల్లడించాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు .. కాలిఫా సామ్రాజ్య స్థాపనకు ప్రయత్నించారు. అయితే ఐఎస్‌ను నూరు శాతం సమూలంగా నాశనం చేశామని సిరియా డెమోక్రటిక్ దళాలు స్పష్టం చేశాయి.

సుమారు 88 వేల చదరపు కిలోమీటర్ల నేల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉండేది. సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు మహాబీభత్సం సృష్టించారు. అయితే కలిఫా ప్రాంతం నుంచి ఐఎస్‌ను తరిమేసినా.. ఇంకా సిరియాలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. కుర్దిష్ నేతృత్వంలోని ఎస్‌డీఎఫ్ బలగాలు.. ఈనెల ఆరంభంలో చివరి ఏరివేత మొదలుపెట్టారు. దాని ప్రకారమే ఈస్ట్రన్ సిరియాలో ఉన్న మిలిటెంట్లను తరిమేశారు. బగూజ్‌లో ఉన్న తీవ్రవాదులను తరిమేయడంతో.. ఐఎస్‌పై నూరు శాతం విక్టరీ సాధించినట్లు అమెరికా సంయుక్త (ఎస్‌డీఎఫ్) బలగాలు వెల్లడించాయి.

Related posts