telugu navyamedia
సినిమా వార్తలు

“భోళా శంకర్” రాఖీ స్పెషల్ సర్ప్రైజ్..

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందనున్న మూవీ “భోళా శంకర్”. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయమే సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని చూపించే కథాంశం. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ న‌టిస్తుంది. అదే విధంగా చిరంజీవి ఈ సినిమాలో గుండుతో కనిపించనున్నారు.

రాఖీ పండగ సందర్భంగా ఈ చిత్రంలో చిరుకు సోదరిగా నటించబోతున్న హీరోయిన్‌ని ప్రకటిస్తూ అదరిపోయే వీడియోని వదిలారు. అందరూ ఊహించినట్లుగానే ఇందులో చిరంజీవికి చెల్లిగా స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ నటించబోతుంది. రాఖీ పండగ సందర్భంగా కీర్తి చిరుకు రాఖీ కడుతున్న పోస్టర్ ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అంతేకాకుండా “భోళా శంకర్”లో కీర్తి సురేష్ కూడా ప్రధాన పాత్రలో కన్పించనుంది అనే విషయం అధికారికంగా అనౌన్స్ అయ్యింది. మహతి స్వర సాగర్ వీడియో కోసం మనోహరమైన సంగీతాన్ని అందించారు.“భోళా శంకర్” టైటిల్, మోషన్ పోస్టర్‌కు సోషల్‌ మీడియాలో అద్భుతమైన స్పందన వచ్చింది.

Viral Video: Keerthi Suresh Rakhi With Megastar Chiranjeevi - Sakshi

సినిమా కోల్ క‌త్తా నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు పోస్టర్ ద్వారా చెప్పేశారు. పోస్టర్లో హౌరా బ్రిడ్జి తో పాటు పలు చారిత్రాత్మక కట్టడాలు కన్పించడం ఆసక్తిని కలిగించింది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న “భోళా శంకర్” 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts