telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విరాట్ కోహ్లీకి మహేష్ బాబు బర్త్ డే విషెస్

Virat

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూపర్ స్టార్ మహేష్ బాబు తన విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ”నా అభిమాన క్రికెటర్లలో ఒక‌రైన విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు. భవిష్యత్తులో మీరు ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ భార‌తదేశం గ‌ర్వించేలా చేయాలని కోరుకుంటున్నా. దూసుకుపో..” అంటూ అందరినీ హుషారెత్తించేలా విష్ చేశారు. ఈ మేరకు కోహ్లీ ఫోటో షేర్ చేశారు మహేష్. నేడు (నవంబర్ 5) భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు. నేటితో 31 ఏళ్ళు పూర్తిచేసుకొని 32వ యేట అడుగు పెడుతున్నారు ఈ సూపర్ బ్యాట్స్‌మెన్. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సినీ, క్రీడా ప్రముఖులు బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఇటీవలే తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. తన సతీమణి అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు.

Related posts