తెలుగు, తమిళంలో మంచి కథా చిత్రాలు చేసి మిల్కీ బ్యూటీ తమన్నా అందరి అభిమానాన్ని చూరగొంది. ఇప్పుడు మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. హారర్ కామెడీ చిత్రంతో తమన్నా మాలీవుడ్ డెబ్యూ ఇస్తుంది. ఈ చిత్రానికి సెంట్రల్ జెయిలే ప్రేతమ్ అనే టైటిల్ ఖరారు చేశారు. సెంట్రల్ జైల్‌లో ఉండే దెయ్యం కథగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తమన్నా మెయిన్ లీడ్ పోషిస్తుంది. పలువురు మాలీవుడ్ స్టార్స్ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంధ్యామీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇండియన్ ఆర్ట్స్ స్టూడియో నిర్మిస్తుంది. తమన్నా త్వరలో సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు క్వీన్ రీమేక్‌గా తెరకెక్కిన దటీజ్ మహాలక్ష్మీ చిత్రంతోను ప్రేక్షకులని పలకరించనుంది.