telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నిరాడంబరంగా భద్రాద్రిలో స్వామివారి కల్యాణం

నేడు శ్రీరామ నవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగి ఉండేవి. వాడవాడనా ఉండే రామాలయాలు ఉదయం నుంచే భక్తులతో కితకితలాడేవి. కానీ కరోనా మహమ్మారి కారణంగా సందడి లేకుండానే శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. ఇక భద్రాచలంలో నేడు కన్నులపండువగా నిర్వహించనున్న శ్రీరామ నవమి ఉత్సవాలను తిలకించే భాగ్యం ఈసారి భక్తులకు దక్కలేదు. టీవీలో వీక్షించి ఆనందపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

కరోనా వైరస్ నేపథ్యంలో భక్తుల భాగస్వామ్యం లేకుండానే రాములవారి కల్యాణం నిర్వహించనున్నారు. మూడున్నర శతాబ్దాల చరిత్రలో భద్రాచలంలో ఇలా జరగడం ఇదే తొలిసారి.కేవలం కొద్దిమంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో ఈసారి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. ప్రభుత్వం ప్రతినిధులుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నారు.

Related posts