telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

కరోనా ఎఫెక్ట్.. సింగరేణిలో లే ఆఫ్‌!

coal singareni

కరోనాను కట్టడిచేసేందుకు ఈ రోజు సెకండ్‌ షిఫ్ట్‌ నుండి సింగరేణి సంస్థలో లే ఆఫ్‌ను వర్తింపజేస్తున్నట్లు జీఎం పర్సనల్‌ ఆర్‌సి, ఐఆర్‌అండ్‌పీఎం ఏ.ఆనందరావు తెలిపారు. ప్రపంచాన్నిఉక్కిరిబిక్కిర్ చేస్తున్న కరోనా వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డిజీఎంఎస్‌ అండ్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ సర్కులర్‌ను అనుసరిస్తూ సింగరేణి సంస్థలో సైతం ఈ రోజు సెకండ్‌ షిఫ్ట్‌ నుండి లే ఆఫ్‌ ప్రకటించడం జరిగిందన్నారు.

లే ఆఫ్‌ వల్ల 22 వేల మంది ఉద్యోగులు ప్రభావితం అవుతారన్నారు. పని జరిగే ఐదు మెకనైజ్డ్‌ గనుల్లో అదేవిధంగా కార్యాలయాల్లో శానిటైజర్లు, మాస్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు విధిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిందిగా సూచించారు.

Related posts