పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగానే ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు హెల్త్ కార్డులను మంజూరు చేసింది. ఈ హెల్త్ కార్డుల కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన అందరికి హెల్త్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇక ఇదిలా ఉంటె, హెల్త్ కార్డులను సామాన్యులతో పాటుగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీసుకున్నారు. కాళీఘాట్ లోని జోయ్ హింద్ భవన్ లో కోల్ కతా మున్సిపాలిటీ సంస్థ పంపిణి చేసిన హెల్త్ కార్డులను తీసుకోవడానికి ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుంది. అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి సామాన్యులతో పాటుగా క్యూలైన్లో నిలబడి హెల్త్ కార్డులను తీసుకున్నారు. మమతా బెనర్జీతో పాటుగా రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ మంత్రి ఫర్హాద్ హకీమ్ కూడా క్యూలైన్లో నిలబడి హెల్త్ కార్డులు తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్వాస్థ్య సాథీ పధకం పేరుతో హెల్త్ కార్డులను మంజూరు చేస్తోంది. చూడాలి మరి ఈ ఆలోచనతో ఆ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందా… లేదా అనేది.
previous post