telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో బీజేపీ ఆటలు సాగవు : పీసీసీ చీఫ్

ఢిల్లీలో గత 40 రోజులుగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రైతుల విషయం లో ప్రధాని దోరణి బాగా లేదు అని ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమెన్ చాంది అన్నారు. రైతాంగ భారతంలో రైతులను విస్మరించడం బీజేపీ కే చెల్లింది. రైతులంతా బీజేపీని  గద్దె దించడం కోసం పనిచేయాలి. అగ్రికల్చర్ రాష్ట్ర పరిధిలోని అంశం… కానీ కేంద్ర ఎందుకు పెత్తనం చేయాలని చూస్తుంది. జై జవాన్ ,జై కిసాన్ ను బీజేపీ ప్రభుత్వం మర్చిపోయింది.. అసలు ఈ నినాదం మీనింగే మార్చేశారు అని చెప్పిన ఉమెన్ చాంది రైతు ల తరుపున ఏపీ లో ఉద్యమాలు చేపడుతాం అని పేర్కొన్నారు. అలాగే ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేవాలయాల పై జరుగుతున్న దాడులను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది… ప్రభుత్వం ఈ దాడుల పై సీరియస్ గా దృష్టి పెట్టాలి. ఏపీలో బీజేపీ ఆటలు సాగవు. బీజేపీ వాళ్ళు మాత్రమే హిందువులు కాదు.. మేము కూడా హిందువులమే. పనికిమాలిన మాటలు బీజేపీ నేతలు మాట్లడకుంటె మంచిది. ఒకటి రెండు రోజుల్లో తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ని ప్రకటిస్తాం అని అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts