telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

క్వారంటైన్‌ ముద్రతో బ్యాంకుకు వచ్చిన వ్యక్తి .. బ్రాంచ్‌ మూసివేసిన అధికారులు

corona stamps ms

లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేతిపై హోం క్వారంటైన్ ముద్ర ఉన్న వాళ్లు బయట కనిపిస్తే కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కొందరు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు లెక్కచేయడం లేదు. అలాంటి వ్యక్తుల వల్ల ఇతరులకు ఇబ్బందులు ఎదురవు తున్నాయి. తాజాగా చేతిపై హోం క్వారంటైన్ ముద్రతో ఉన్న ఓ వ్యక్తి మూడు రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖకు వచ్చాడు. బ్యాంకు లావాదేవీల కోసం వచ్చిన ఆ వ్యక్తిని సిబ్బంది ప్రశ్నించగా.. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వెల్లడైంది. దీంతో బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

జరిగిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి బ్యాంక్ సిబ్బంది తీసుకెళ్లారు. వారి సూచన మేరకు బ్యాంకులో పని చేస్తున్న 18 మంది సిబ్బంది 14 రోజుల స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆ బ్యాంకు శాఖను తాత్కాలికంగా మూసివేశారు. ఈ నెల 27వ తేదీ వరకు బ్రాంచ్‌ను మూసేస్తున్నట్టు ప్రకటించారు.

Related posts