telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు నీతి ఆయోగ్ సమావేశం.. తెలంగాణ సీఎం గైర్హాజర్!

cm kcr red signal to 3 sitting mps

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో జరగాల్సిన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వ్యవసాయ సంక్షోభం, కరువు, ఆర్థిక పరిస్థితి, దేశ రక్షణ తదితర అంశాలపై చర్చ జరగనుంది.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను దగ్గరుండి చూసుకుంటున్న సీఎం నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

అయితే, ఈ నెల 16న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో అనుమతి కోరారు. ప్రధాని కార్యాలయం నుంచి అనుమతి వస్తే ఆయన ఢిల్లీ వెళ్తారు. కాగా ఈ సమావేశానికి హాజరు కావడం లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే తెలిపింది.

Related posts