రేపటి నుండి విశాఖపట్నం-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్ర్‌ప్రెస్ సర్వీసులు లాంఛనంగా ప్రారంభమవుతాయని, శుక్రవారం నుంచి ఈ సర్వీసులు పూర్తిస్థాయిలో పట్టాలెక్కనున్నాయని భారత రైల్వే శాఖ వెల్లడించింది. విశాఖ-విజయవాడ మధ్య వారంలో ఐదురోజులపాటు డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రీ ఎక్స్‌ప్రెస్(ఉదయ్)ను నడపనున్నట్టు తెలిపింది.
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ చెన్నబసప్ప అంగడి గురువారం లాంఛనంగా ఉదయ్‌ను ప్రారంభిస్తారని తెలిపింది. ప్రారంభోత్సవరం సందర్భంగా 02701 నంబర్ ఉయద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి విజయవాడ బయలుదేరుతుందని, ఈ రైలు కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయని పేర్కొంది.