telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నామినేట్

biswabhusan harichandan governor

ఏపీ గవర్నర్‌ కోటాలో గతంలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణరాజు, టి.రత్నబాయిల పదవీకాలం మార్చిలో ముగిసింది. సీఎం వైఎస్‌ జగన్‌ సిఫార్సు మేరకు వారి స్థానంలో పి.రవీంద్రబాబు, జకియా ఖానుమ్ లను నూతన ఎమ్మెల్సీలుగా గవర్నర్ బిశ్వభూషణ్‌ నామినేట్ చేశారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పండుల రవీంద్రబాబు 2014లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. వృత్తిరీత్యా వైద్యుడిగా ఢిల్లీలో సేవలందించారు. ఇండియన్‌ రెవెన్యూ సర్వీసుకు ఎంపికై ముంబై, కోల్‌కతా, విశాఖపట్నంలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ కమిషనరగ్‌గా పనిచేశారు.

వైఎస్సార్‌ జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌ భర్త మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌గా , పార్టీ సీనియర్‌ నేతగా సేవలందించారు. ఎమ్మెల్సీలుగా తమను నామినేట్‌ చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వారు అభినందనలు తెలిపారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని నూతన ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.

Related posts