telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డేటింగ్ తేదీ ఫిక్స్ చేసేసిన కియారా అద్వానీ

Kiara-Advani

2014లో తొలిసారిగా కియారా అద్వానీ ‘ఫగలీ’ సినిమాతో బాలీవుడ్‌లో కాలు మోపారు. కానీ అక్కడ సరైన హిట్ ను అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. ఆ తరువాత తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ “కబీర్ సింగ్” చిత్రంతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది కియారా అద్వానీ. ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇక ఇటీవలే అక్షయ్ కుమార్ హీరోగా “లక్ష్మీ బాంబ్”లో నటించిన కియారా… ప్రస్తుతం “ఇందూ కి జవానీ”, “భూల్ భూలయ్య-2″లో నటిస్తోంది. వీటిలో “ఇందూ కి జవానీ” సినిమా షూటింగ్ ను ముగించుకుంది. ఇక ఈ సినిమా త్వరలో ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నారు. అబీర్ సేన్ గుప్తా ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఇందూ కి జవానీ’ డేటింగ్ నేపథ్యంలో సినిమా. తాజాగా ఈ సినిమా విడుదల డేట్ ను అనౌన్స్ చేసారు. తాజాగా కియరా ఓ ఫన్నీ వీడియోను అభిమానులకు షేర్ చేసింది. ఈ వీడియోలో ఇందూ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారా…? డేటింగ్ తేదీ ఫిక్స్ చేసేద్దామా… స్క్రీన్ పైనే 16 సెప్టెంబర్… అంటూ చెప్పింది కియారా. ఈ ఫన్నీ వీడియో కియారా అభిమానులను ఆకట్టుకుంటుంది.

Related posts