telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డేటింగ్‌ యాప్‌ సంస్కృతికి ఈ ముంబయి బ్యూటీ వ్యతిరేకమట…!

Adah-Sharma

సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు, లఘు చిత్రాల్లో నటిస్తూ ప్రతిభను చాటుకుంటున్నది ముంబయి ముద్దుగుమ్మ అదాశర్మ. ఇటీవల ‘టిండే’ అనే లఘు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. డేటింగ్‌ యాప్స్‌, వివాహేతర సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ లఘు చిత్రంలో అదాశర్మ అభినయానికి ప్రశంసలు దక్కాయి. అదాశర్మ మాట్లాడుతూ “వివాహేతర సంబంధాల్ని నేను అమోదించను. వాటికి వ్యతిరేకం. ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అతనితోనే జీవితాన్ని పంచుకోవాలి. ఎప్పటికీ ఆ బంధాన్ని కొనసాగించాలి. ఆ నమ్మకం లేనప్పుడు పెళ్లికి దూరంగా ఉండటమే మంచిది. అనైతిక బంధాలు మనిషిని దిగజార్చుతాయి. ఈ బంధాలకు దూరంగా ఉండే వాడినే జీవితభాగస్వామిగా ఎంచుకుంటాను” అని తెలిపింది. డేటింగ్‌ యాప్‌ సంస్కృతికి తాను వ్యతిరేకమని, వాటిని తానేప్పుడూ ఉపయోగించలేదని అంటోంది అదాశర్మ. ఆధునిక కాలంలోనూ తాను ఓల్డ్‌ స్కూల్‌ రొమాన్స్‌నే ఇష్టపడతానని చెబుతోంది.

Related posts