నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఐఎస్‌ఎల్ లో బోణీ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ 2-1తో ఒడిశాపై గెలిచింది. నార్త్ ఈస్ట్ ఆటగాళ్లు రెడీమ్ త్లాంగ్ (2వ ని.), గ్యాన్ (84వ ని.) చెరో గోల్ సాధించారు. ఒడిశా తరఫున హెమాండేజ్ (71వ ని.) గోల్ చేశాడు. ఆరంభంలోనే గోల్ సమర్పించుకున్న ఒడిశా ఆ తర్వాత తేరుకుంది. 71వ నిమిషంలో స్కోర్‌ను సమం చేసింది.
ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఒడిశా ప్లేయర్ డెల్గాడోకు రెడ్‌కార్డు లభించడంతో ఆ జట్టు చివరి 18 నిమిషాలు 10 మందితోనే ఆడింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ గ్యాన్ చివర్లో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.