telugu navyamedia
సినిమా వార్తలు

‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిపోయే ఆప్డేట్..

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.

మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారట.

గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపించబోతున్నారట. ఈ నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే విడుదల అయ్యాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు సినిమా యూనిట్ అదిరిపోయే న్యూస్ చెప్పింది.

రేపు పవన్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న సాయంత్రం 5.45 గంటలకు పవర్ గ్లాన్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. తాజాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ మరో పోస్టర్ విడుదల చేసింది. ‘‘స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం’’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

యుద్ధ రంగంలో పవన్ కల్యాణ్ పోరాడుతున్నట్లుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. గుర్రం రథంతో ఆయన దూసుకెళ్తున్నారు. పవన్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తూ ఈ పోస్టర్ మీద హ్యాపీ బర్త్ డే అని రాశారు.

Related posts