telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్ పదే పదే కోరినా నితీష్ అయిష్టత ప్రదర్శించారు -కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీహార్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తించు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని.. అయితే అది అంత సులభం కాదన్నారు.

అసలు కేసీఆర్‌ను జాతీయస్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణను ఉద్దరించానని దేశమంతా తిరిగి చెబుతున్నారు.

బీహార్‌లో నిన్న మీడియా సమావేశం జరుగుతున్న సమయంలో కేసీఆర్ మాటలు వినలేక నితీష్కుమార్ లేచి వెళ్లే పరిస్థితి.

కేసీఆర్ పదే పదే కోరినా కూడా నితీష్ కుమార్ కూర్చోవడానికి అయిష్టత ప్రదర్శించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

ఇద్దరు నేతలు కలిసి కూర్చోలేని పరిస్థితి విపక్ష పార్టీల్లో నెలకొందన్నారు. అలాంటి నేతలందరిని కేసీఆర్ ఎలా ఏకతాటిపైకి తెస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ రైతులు గోస పడుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అంటే తెలంగాణ రైతులను పట్టించుకోక పోవడమే తెలంగాణ మోడలా?’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించామని దేశంలో ఇతర రాష్ట్రాల్లో మాత్రం సమస్యలు అలానే ఉన్నాయని కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.

యూపీ, పంజాబ్, ఢిల్లీ, బీహర్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను కేసీఆర్ కలిశారన్నారు. కేసీఆర్ మాటలను విపక్షాలకు చెందిన ఎవరూ కూడా పట్టించుకోవడం లేదన్నారు. దేశానికి కల్వకుంట్ల కుటుంబమే దిక్కు అన్నట్టుగా కేసీఆర్ ప్రచారం చేసుకోవడాన్ని కిషన్ రెడ్డి తప్పు బట్టారు.

Related posts