తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ హీరోగా “రాజా రాణి” ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బిగిల్’. తెలుగులో బిగిల్ అంటే “విజిల్” అని అర్థం. ఇది వరకు ఈ హిట్ కాంబినేషన్‌లో విడుదలైన ‘తెరి’ (పోలీస్), ‘మెర్సల్’ (అదిరింది) చిత్రాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి కలయికలో హ్యాట్రిక్ చిత్రంగా ‘బిగిల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార హీరోయిన్. కతిర్, యోగిబాబు, వివేక్, జాకీష్రాఫ్, ఇందుజా రవిచంద్రన్, ఆనంద్ రాజ్, మోనికా జాన్ తదితరులు నటించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. “బిగిల్” చిత్రాన్ని తెలుగులో “విజిల్” పేరుతో నిర్మాత మహేశ్ కొనేరు విడుదల చేశారు. సినిమా విడుదల నేపథ్యంలో తమిళనాట పండుగ వాతావరణం నెలకొంది. అయితే సినిమా రిలీజ్ విషయంలో కొద్ది రోజులుగా పలు చర్చలు జరగగా, ఎట్టకేలకి తమిళనాడు ప్రభుత్వం రిలీజ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫ్యాన్స్ కోసం నిన్న రాత్రి స్పెషల్ షో వేయలేదని కోపోద్రిక్తులైన విజయ్ ఫ్యాన్స్ థియేటర్ ముందు ఉన్న షాపులకి నిప్పు పెట్టారు. పోలీస్ వాహనాలు, మున్సిపల్ వాహనాలని కూడా తగులపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డ్ కాగా, వాటిని పరిశీలించిన పోలీసులు 37 మందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.