telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“లవ్ స్టొరీ” లొకేషన్ లో శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్

Sekhar Kammula

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్”లవ్ స్టొరీ” లొకేషన్ లో యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగాయి. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత సునీల్ నారంగ్ లతో పాటు భరత్ నారంగ్, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా తదితరులు దర్శకుడు శేఖర్ కమ్ములకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో ‘లవ్ స్టొరీ’ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ ల్లో ఉన్న ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతికి విడుదల చేసిన ‘లవ్ స్టొరీ’ ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.శేఖర్ కమ్ముల, చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ క్రేజ్ కి ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related posts