telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సువెందు పై ఆధిక్యం లోకి వచ్చిన మమత…

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. కరోనా నిబంధనలు కారణంగా నెగటివ్ రిపోర్ట్ ఉన్న వారికీ మాత్రమే కౌంటింగ్ సెంటర్ కి అనుమతి ఇస్తున్నారు. అక్కడ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు జరుగుతోంది కౌంటింగ్. తృణమూల్ కాంగ్రెస్- బిజేపి మధ్య హోరా హోరీగా ఎన్నిక జరుగగా, ఫలితాలు మాత్రం అలా లేవు. ఇప్పటి వరకు మొత్తం 292 స్థానాలకు అధిక్యాలు రాగా.. టీఎంసీ 202 చోట్ల, బిజేపి 86 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అయితే మమతా ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకున్న నందిగ్రామ్ లో.. ఆమె ప్రత్యర్థి సువేందు పై ఆధిక్యంలోకి వచ్చారు. మొదట్లో మమతా వెనుకంజలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు సువేందు పై ఆధిక్యంలోకి రావడం విశేషం. అయితే తుది ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.

Related posts