telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అబ్దుల్ కలాం పాత్రలో ప్రముఖ నటుడు

APJ

మిసైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం బ‌యోపిక్‌ని అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ రూపొందించ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. రామ‌బ్ర‌హ్మం సుంక‌ర, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లో తెర‌కెక్కించ‌నున్నారు. అయితే ఇందులో అబ్ధుల్ క‌లాం జీవితంలో ఏం జ‌రిగింది? అనే అంశాల‌ని కాకుండా చిన్న‌త‌నంలోని వివిధ ద‌శ‌ల‌లో ఆయ‌న ఆలోచ‌న‌లు ఎలా ఉండేవి? అన్న దానిపై సినిమా తీయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అబ్దుల్‌ కలాం 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పేద కుటుంబలో పుట్టిన ఆయన ఎన్నో అడ్డంకులను ఎదర్కొని రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అనేక ఇబ్బందుల‌ని ఎదుర్కొని ఆయ‌న ఈ స్థాయికి చేరుకోగా, ఆయ‌న ఆలోచ‌న‌లో దాగి ఉన్న ప్రేరణాత్మకమైన విషయాల నేప‌థ్యంలో ఈ బ‌యోపిక్ రూపొందినున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం రాజ్ చెంగప్ప వ్రాసిన కలాం జీవిత చరిత్ర ఆధారంగా రూపొంద‌నుంద‌ని స‌మాచారం. 83 ఏండ్ల వయస్సులో జూలై 2015న ఐఐఎం షిల్లాంగ్‌లో ప్రసంగిస్తూ కలాం కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కాగా క‌లాం పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే అనుమానం అభిమానుల‌లో ఉండ‌గా, తాజాగా దీనిపై క్లారిటీ వ‌చ్చింది. బాలీవుడ్ న‌టుడు ప‌రేష్ రావ‌ల్‌ ‘కలాం పాత్రలో నటించడం నా అదృష్టం’ అని ట్వీట్ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల‌లో ఈ చిత్రం రూపొంద‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Related posts