telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండపై దర్శకుడి అలక… ఎందుకంటే…?

Vijay-Devarakonda

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన “డియర్ కామ్రేడ్” చిత్రంలో నటిస్తున్నారు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… రష్మిక మందన్న మరోసారి విజయ్ తో జతకడుతోంది. అయితే “గీత గోవిందం” సినిమాతో విజయ్ తరువాత సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. దీంతో ఇప్పటివరకు సినిమా మార్కెటింగ్ విషయంలో మాత్రమే ఇన్వాల్వ్ అయ్యే విజయ్ దేవరకొండ ఇప్పుడు విజయ్ ఇప్పుడు దర్శకుడి పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు చేయాల్సిన పని కూడా తనే చేస్తున్నాడట. ఈ సినిమాలో ఏ సీన్ ఉంచాలి..? ఏది తీసేయాలనే విషయాన్ని దేవరకొండ డిసైడ్ చేస్తున్నాడట. విజయ్ మీద నమ్మకంతో నిర్మాతలు కూడా సైలెంట్ అయ్యారట. దీంతో దర్శకుడు భరత్ కమ్మ విసిగిపోయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు దూరంగా ఉంటున్నాడట. డైరెక్టర్ అలిగాడని విజయ్ కి అర్ధమైనా.. విజయ్ పట్టించుకోకుండా ఈరోజు ఇంతవరకు పని చేశామని డైరెక్టర్ కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts