ప్రపంచానికి కరోనా అంటించిన దేశం చైనా. అయితే అక్కడ కరోనా తరువాత చైనా పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు చైనాను వ్యతిరేకిస్తున్నాయి. చైనా ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా, చైనా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ నిర్వహణకోసం పాక్ కు చైనా 60 బిలియన్ల ఆర్ధిక సాయం చేస్తానని చెప్పింది. కాగా, ఇప్పుడు దానిని టెర్రరిజం సాకులు చెప్పి ఇవ్వడానికి నిరాకరిస్తోంది. అసలు కారణం ఆర్ధికంగా చైనా ఇబ్బందులు ఎదుర్కొనడమే. ఇక చైనాలోని క్రిస్మస్ టౌన్ గా ప్రసిద్ధిపొందిన యీవూ నగరాన్ని పరిశీలిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకు సంబంధించి డెకరేటెడ్ వస్తువులను తయారు చేసే కంపెనీలు ఈ నగరంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచే ప్రపంచంలోని అనేక దేశాలకు డెకరేటెడ్ వస్తువులు ఎగుమతి చేస్తుంటారు. అయితే, గత కొంతకాలంగా ఈ నగరం చీకట్లలో మగ్గుతున్నది. కారణం కరెంట్ కోత. కరెంట్ వినియోగంపై అనేక ఆంక్షలు విధించింది చైనా. మూడు ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ లలో లిఫ్ట్ వాడకూడదని, 3డిగ్రీల సెల్సియస్ వరకు హీటర్లు వాడొద్దని షరతులు విధించారు. ఇక ఈ నగరంలో ఉన్న వందలాది ఫ్యాక్టరీలకు కరెంట్ సప్లయ్ సరిగా లేకపోవడంతో పరిశ్రమలు సరిగా పనిచేయడం లేదు. పరిశ్రమలపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు హాస్పిటల్స్ సైతం ఇలానే ఉన్నాయి.
పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్ పై విచారణ చేపట్టాలి: చంద్రబాబు డిమాండ్