కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆనందయ్య కరోనా మందు దేశ వ్యాప్తంగా చర్చముషానియమైంది. దాంతో ఆనందయ్య గ్రామం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంకి ప్రజలు లైన్ కట్టారు. కానీ ఇప్పుడు ఆ గ్రామంలోకి రావాలంటే తప్పని సరిగా ఆధార్ కార్డ్ తప్పని సరి చేశారు. ఆనందయ్య మందుకోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు తప్ప మరెవరూ గ్రామంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేదని, గ్రామస్తుకు కూడా బయట నుంచి గ్రామంలోకి రావాలంటే ఆధార్ కార్డు తప్పని సరి అని పోలీసులు చెబుతున్నారు. కృష్ణపట్నంలో ప్రస్తుతం 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. గ్రామస్తులు తప్ప ఇతరులను గ్రామంలోకి అనుమతించడం లేదు. ఇక ఆనందయ్య మందు తయారీని కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. మందు పంపిణీకి మరో నాలుగు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
previous post
next post
యురేనియం తవ్వకాలపై చంద్రబాబు ఫైర్