telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

సుజనా చౌదరి .. విచారణకు హాజరు కావాల్సిందే… : హైకోర్టు

Telangana Inter results petition High court

తెలంగాణ హైకోర్టు టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరు కావల్సిందేనంటూ స్పష్టం చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో విచారణకు రావాలంటూ సీబీఐ పంపిన నోటీసులను సుజనా హైకోర్టులో సవాల్ చేయగా, ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే, సుజనాకు ఊరట కలిగించేలా న్యాయమూర్తులు ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు.

సుజనాచౌదరిని ఆదేశించిన హైకోర్టు, బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ .. మే 27, 28 తేదీల్లో రెండ్రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని సీబీఐకి తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే ఆయనను విచారించాలని, మధ్యలో మధ్యాహ్న భోజనానికి తగినంత విరామం ఇవ్వాలని సూచించింది. ముఖ్యంగా, ఎట్టిపరిస్థితుల్లోనూ సుజనా చౌదరిని అరెస్ట్ చేయవద్దని, అలాగే శారీరకంగా హింసించడం లాంటి చర్యలకు పాల్పడవద్దని హైకోర్టు సీబీఐకి స్పష్టం చేసింది.

Related posts