telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీమ ప్రజలకు తాగునీరు ఇవ్వండి.. సీఎం జగన్ కు లోకేశ్ సూచన!

Minister Lokesh comments YS Jagan

రాయలసీమలో తాగు నీటి సమస్య గురించి ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. సీమలో కరవు తాండవిస్తోందనిన్నారు. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం గత రెండు నెలలుగా ఇక్కడ నమోదైందని అన్నారు. సాగునీరు సంగతి తర్వాత, తాగునీరు కూడా లేని పరిస్థితి నెలకొందనన్నారు. ప్రజలు గుక్కెడు నీళ్ళ కోసం రోడ్డెక్కి ధర్నాలు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ప్రజలకు గుక్కెడు నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే జలవాణి కార్యక్రమం ద్వారా, ట్రాక్టర్లతో నీటి సరఫరా జరగేదని గుర్తుచేశారు. తమపై కోపంతో ఆ కార్యక్రమం కూడా ఎత్తేసినట్టు ఉన్నారని అన్నారు. మన నీళ్ళు “తెలంగాణా” కు తరువాత ఇవ్వొచ్చు.. ముందు సీమ ప్రజలకు తాగునీరు ఇవ్వండని జగన్ కు లోకేశ్ సూచించారు.

Related posts