telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏడేళ్ల స్నేహం, మూడేళ్లు డేటింగ్… లవ్ స్టోరీ గురించి చెప్పేసిన కాజల్

Kajal

టాలీవుడ్ చందమామ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ నవ దంపతులకు స్పెషల్‌గా విషెస్ చెబుతున్నారు. ముంబైలోని స్టార్ హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్‌లో కాజల్- గౌతమ్ వివాహ వేడుక జరిగింది. పంజాబీ, కశ్మిరీ సంప్రదాయల్లో ఈ వేడుక నిర్వహించారు. కేవలం ఇరు కుటుంబాల సన్నిహితులు, దగ్గరి బంధువులు మాత్రమే కాజల్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. హోమ్ డెకార్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీని నడిపిస్తూ ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు కాజల్ భర్త గౌతమ్ కిచ్లు. ప్రస్తుతం కాజల్ పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మేగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కాజల్ తమ లవ్‌స్టోరీ గురించి మాట్లాడింది. “పదేళ్ల క్రితం కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం. మాది ఏడేళ్ల స్నేహం. మూడేళ్లు డేటింగ్ చేశాం. వీలు కుదిరినప్పుడల్లా కలిసేవాళ్లం. అయితే లాక్‌డౌన్ సమయంలో పెద్దగా కలవడం కుదరలేదు. ఒకరి జీవితంలో మరొకరు ఎంత ముఖ్యమనేది అప్పుడే అర్థమైంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. తన జీవితంలో నాకు ఎంత ప్రాముఖ్యం ఉందనేది గౌతమ్ చెప్పాడు. నాతో తన భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయం గురించి మాట్లాడాడు. రొమాన్స్ విషయంలో గౌతమ్ కాస్త తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే అతడికి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేదు కదా. గౌతమ్ కంటే నేనే ఎక్కువ రొమాంటిక్. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో మా పేరెంట్స్‌ను గౌతమ్ కలిశాడు. నిశ్చితార్థం జూన్‌లో జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నాం. కాని కరోనా మా ప్లాన్‌లను తలకిందులు చేసింది. పెళ్లి దుస్తుల కోసం కూడా ఎక్కడికీ వెళ్లలేదు. ఆన్‌లైన్‌లోనే దుస్తుల ఎంపిక చేశాము” అని తన లవ్ స్టోరీ గురించి కాజల్ చెప్పుకొచ్చింది.

Related posts