telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు : ఎన్టీఆర్

NTR

సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడటమే కాకుండా అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ వారికి దగ్గరై వ్యక్తిగత సమాచారం, ఫోటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎంతోమంది యువతులు కేటుగాళ్ల వలలో పడి మోసపోవడమే గాక మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సామజిక మాధ్యమాల్లో సమాచారాన్ని షేర్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దానిపై తగు సూచనలిచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం ద్వారా అమ్మాయిలు మోసపోతున్న విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఓ వీడియో రూపొందించారు హైదరాబాద్‌ నగర పోలీసులు. సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి చేతిలో మోసపోయిన ఓ యువతి పడుతున్న మానసిక క్షోభను ఇందులో చూపించారు. ఈ వీడియో చివర్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అలాంటి మోసాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ప్రతి యువతి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని సూచనలిచ్చారు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి. జాగ్రత్త!” అంటూ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.

Related posts