నేడు అంటే శుక్రవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జగన్ ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్ మొదట భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
పులివెందులలో రిటర్నింగ్ అధికారికి మధ్యాహ్నం 1.40 నుంచి 1.49 నిమిషాల మధ్యలో జగన్ నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. జగన్ నామినేషన్ నేపథ్యంలో పులివెందులలో భారీగా కోలాహలం కనిపిస్తోంది. మంచి రోజు కావడంతో ముందు నిర్ణయించినట్టుగా చంద్రబాబు కూడా ఆయన భార్య ద్వారా నేడు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా కూడా చంద్రబాబు నామినేషన్ లోకేష్ సమర్పించిన విషయం తెలిసిందే.
వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు: కన్నా