telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోలీస్ స్టేషన్ ఎదుట కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం

Mahesh

ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పని చేసే యువకుడు అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసుల వల్ల తన జీవితం నాశనం అయిందని, పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు హైదరాబాద్‌లో దర్శకుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పని చేస్తున్నారు. కొద్దిరోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండటంతో ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇందు కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టుకున్నాడు. ఈ తరుణంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారంటూ సోమవారం రాత్రి మహేష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే ఇంట్లో మద్యం బాటిళ్లు దొరకలేదు. కానీ, అతడి ఇంటి పక్కన ఉన్న గల్లీలో 12 మద్యం సీసాలు దొరికాయి. దీంతో ఆ బాటిళ్లతో తనకు సంబంధం లేదని, తమ ఇంట్లో దొరకలేదు కదా అని ప్రశ్నించగా.. పోలీసులు తన పట్ల దారుణం వ్యవహరించారని మహేష్ తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమ మద్యం కేసు నమోదు చేశారని మహేష్ పేర్కొన్నారు. దీంతో పెళ్లిపీటలపై దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయిందని వాపోయారు. తన జీవితాన్ని పోలీసులు నాశనం చేశారని, అందుకే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసినట్లు మహేష్ పేర్కొన్నాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరారు.

Related posts